/rtv/media/media_files/2025/10/20/wrong-route-2025-10-20-09-26-59.jpg)
నలుగురికి నచ్చినది.. నాకసలే నచ్చదులే అనుకున్నాడట్లుంది ఓ వ్యక్తి. 57సార్లు రాంగ్ రూట్‌లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కాడు ఓ బైకర్. అతనొవరో కానీ.. ఆ బైక్‌పై రూ.58వేల 895 జరిమానా ఉంది. రాంగ్ రూట్లో వెళ్లడమే ఈయన అలవాటులా ఉంది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, వనస్థలీపురం, బీఎన్ రెడ్డి ప్రాంతాల్లో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసి చాలా ఫైన్ ఆ బైక్‌పై ఉన్నాయి.
AP 37 DS 3639 అనే నెంబర్ గల బైక్ 57 సార్లు రాంగ్‌రూట్‌లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కింది. ఆ మొత్తం జరిమానా రూ.58,895లకు చేరింది. ఆదివారం ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రంగూడకు రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో జరిమానా పడిందని ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు తెలిపారు. గతంలో రాంగ్ రూట్ ఫైన్ తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం కొత్త ట్రాఫిక్ రూ.1200 ఫైన్ విధిస్తున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఇంతకుముందు లేదు. మొదటి సారిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్‌లో పోదామని చాలామంది అనుకుంటారు. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు.. ఇక మీదట నిబంధనల విషయంలో కఠిన వైఖరి అవలంబించనున్నారు. ఇన్నాళ్లు నిబంధనలు బేఖాతరు చేసే వారిపై భారీ జరిమానాలు వేస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదని భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏకంగా రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ వారు ప్రమాదానికి కారకులైతే.. జైలు శిక్ష కూడా పడుతుందట.