Prudhvi: కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన పృథ్వీ!
నటుడు పృథ్వీ తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు రెండు రోజులుగా తనను వేధిస్తున్నారని.. ఫోన్స్, మెసేజ్స్ పెడుతూ టార్చర్ చేస్తున్నారని కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.