హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు  సినిమాను మరోసారి వాయిదా వేశారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

New Update
harahara

హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.  ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటుగా ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. అయితే మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్టు 'sword vs spirit' ట్యాగ్ ను  ఖరారు చేశారు. కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.  

Also Read :  ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్‌ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది!

 పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ

 పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో  షూటింగ్ ఆలస్యమౌతూ వచ్చింది.దీనికి తోడు సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి సినిమా వాయిదా పడటంతో  పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. 

Also Read :  రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే?

Also read :  బెస్ట్ ఛాన్స్.. ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. పరీక్ష లేకుండానే ఎంపిక!

Advertisment
తాజా కథనాలు