Holi Songs: బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు

హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్‌గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Update

హొలీ అనేది అందరికీ చాలా ఇష్టమైన పండగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. రంగులతో నిండిన నృత్యాలు, ఆటపాటలతో హొలీ సంబరాలు జరుపుకుంటారు. ఇక హొలీ సంబరాలు రెట్టింపు కావాలంటే.. హోలీకి సంబంధించిన పాటలు (Holi Songs) మారుమోగాల్సిందే. హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్‌గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజు ఈ పాటలను ప్లే చేస్తూ మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. 

Also Read :  ఎమ్మెల్సీలుగా అద్దంకి, విజయశాంతి.. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లిస్ట్ ఇదే!

హొలీ పాటలు 

'బలం పిచ్కారి'

2013లో వచ్చిన యే జవానీ హై దీవానీ (Yeh Jawaani Hai Diwani) సినిమాలోని  'బలం పిచ్కారి' హొలీ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. యువతరం అభిరుచికి సరిగ్గా సరిపోయే సాహిత్యం, సంగీతంతో రూపొందిన ఈ పాట విపరీతమైన ప్రేక్షాదరణ పొందింది. నేటికీ హొలీ సంబరాల్లో ఈ పాటకు చిందులేస్తూ ఎంజాయ్ చేస్తారు. 

Also Read :  షాపు ముందు కూర్చోవద్దని చెప్పినందుకు.. వృద్ధుడిని గుద్ది గుద్ది చంపిన యువకుడు- వీడియో వైరల్!

రంగు రబ్బా రబ్బా 

ఎన్టీఆర్ 'రాఖీ' (Rakhi) సినిమాలోని 'రంగు రబ్బా రబ్బా' హొలీ సాంగ్ అప్పట్లో ఫుల్ పాపులరైంది.  నేటికీ  యూత్ హొలీ వేడుకల్లో ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 

రంగ్ బార్సే

సిల్సిలా చిత్రంలోని  'రంగ్ బార్సే' (Rang Barse) పాట లేకుండా హొలీ వేడుకలు  అసంపూర్ణమే. అమితాబ్ బచ్చన్ పాడిన ఈ పాట ఇప్పటికీ హొలీ సంబరాల్లో మారుమోగుతూనే ఉంటుంది. 

'జై జై శివశంకర్'

2019 లో వచ్చిన  వార్ సినిమాలోని 'జై జై శివశంకర్' హొలీ పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటను యువతరంలో బాగా ప్రాచూర్యం పొందింది. హొలీ వేడుకల్లో ఈ పాటను కూడా ఎక్కువగా ప్లే చేస్తుంటారు. 

Also Read :  జగదీష్ రెడ్డిపై వేటు.. స్పీకర్ సంచలన నిర్ణయం!

అలాగే  హొలీ (Holi) సమయంలో మనం వాడే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం.ప్రకాశవంతమైన,  ముదురు రంగులు వాస్తవానికి నకిలీవి. ఈ రకమైన రంగుల్లో  గాజు పొడి, చక్కటి ఇసుక, పాదరసం సల్ఫైడ్ మొదలైన వాటిని కలుపుతారు. దీనివల్ల ఆ రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాటిని చర్మానికి పూస్తే  హాని కలుగుతుంది. కావున హోలీ రోజున ఎక్కువ ప్రకాశవంతమైన రంగులను కొనకండి. 

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు