Singer Kalpana: నా ప్రైవేటు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.. సింగర్ కల్పన ఫిర్యాదు

తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ  తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు సింగర్ కల్పన. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
Kalpana complaint

Singer Kalpana

Singer Kalpana: తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ  తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు సింగర్ కల్పన. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు.  నిజనిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా చూడాలని మహిళా ఛైర్‌పర్సన్‌ ను ఆమె రిక్వెస్ట్ చేసింది. నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. అంతేకాకుండా తన ప్రైవేటు వీడియోలు అప్ లోడ్ చేస్తూ తన ప్రైవసీకి  భంగం కలిగిస్తున్నారని వాపోయింది.  కల్పన ఫిర్యాదుపై మహిళా కమిషన్‌ సానుకూలంగా స్పందించింది.  అసత్య ప్రచారాలు చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని భరోసాను కల్పించింది.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. 

Also Read:  గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!

Also Read:  షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే గొంతు కోశాడు!

అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో

కాగా సింగర్ కల్పన  అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల సాయంతో వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్‌ ఆమెను ఆసుపత్రికి తరలించింది. అక్కడ  ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం  కల్పన మాట్లాడుతూ.. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని వెల్లడించింది. కేవలం నిద్ర మాత్రల మోతాదు ఎక్కువడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా వెల్లడించింది. ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని...అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నానని సింగర్ కల్పన చెప్పారు. అయితే అధిక మోతాదులో వేసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో సింగర్ కల్పన ఆత్మహత్యకు యత్నించినట్లుగా వార్తలు వచ్చాయి.  దీంతో కల్పన  మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  

Also Read:  ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు!

Also Read:  పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Advertisment
తాజా కథనాలు