South Korea: సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది. నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని, ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని.. ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు.
హైదరాబాద్ MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా మేడ్చల్ జిల్లాకు చెందిన పాతనేరస్తుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధితురాలు నిందితున్ని చూసి అతను కాదని చెప్పినట్టు సమాచారం.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది.
నల్గొండ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి ప్రస్తుతం 10th పరీక్షలకు హాజరవుతోంది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు బిగ్‌షాక్ తగిలింది. లిక్కర్‌స్కాం కేసులో భాగంగా ఇవాళ ఆయన ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాయ్‌పూర్,బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘీల్ ఇంటిపై EDరైడ్స్ జరిగిన విషయం తెలిసిందే.