Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన ఒక నకిలీ పోస్ట్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే దీని మీద పీఐబీ ఓ క్లారిటీ ఇచ్చింది. పీఐబీ ఎలాంటి సందేశాలను పంపలేదని తెలిపింది.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు.దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది.
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటూ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేసింది.
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. సన్నిధానం, పంబ, ట్రక్ రూట్ సహా కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. గతేడాది 900 రిక్వెస్టులు పెట్టి..2,253 మంది యూజర్ల డేటాను అమెరికా ప్రభుత్వం సేకరించిందని అందులో వివరించింది.
కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోలాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో అన్నారు.
ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మాణ్యన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు.వారానికి 90 గంటలు పని చేయాలి.అవసరమైతే ఆదివారాలు కూడా వదిలేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.