Crime: కోడలిని చంపి పాతేసిన అత్తమామలు..రంగారెడ్డి జిల్లాలో దారుణం!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు.దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది.

New Update
ongole crime

ongole crime

Crime: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది.  మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా..మృతదేహన్ని పూడ్చి పెట్టి ఏమి తెలియనట్లు ఉండిపోయారు. అయితే భార్య కనిపించడం లేదని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Up Crime: యూపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. గత కొన్ని రోజులుగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ పనుల కోసం శంషాబాద్ వచ్చారు.

Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్

అప్పటికే ఇద్దరి మద్య తీవ్ర స్థాయిలో గోడవలు జరిగాయి. దీంతో దోలి సాతంరాయిలో ఉన్న అత్తమామల వద్దకు వచ్చింది. అత్త, మామ, కోడలు కలిసి కల్లు కాంపౌండ్ లో మద్యం తాగారు. ముగ్గురు మత్తులోకి జారుకున్నాక కోడలు దోలిని సాతంరాయి త్రీలోక అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకొచ్చారు. 

25 అడుగుల లోపలికి..

అక్కడ అమెను హత్యచేసి మట్టిలో పూడ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే నిర్మాణంలో ఉన్న త్రిలోక అపార్ట్మెంట్ వారు మట్టిని తీసుకొచ్చి అక్కడే డప్ చేయడంతో దాదాపు 25 అడుగుల లోపలికి దోలి మృతదేహం కూడుకుపోయింది. 

ఏమీ తెలియనట్లు కొడుకుతో కలిసి కోడలు కనిపించడం లేదని శంషాబాద్ పోలీసులకు   ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ పోలీసులకు ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటకు వచ్చింది. మట్టి కుప్పలో కూడుకుపోయిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోష్టు మర్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Tirumalaకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు

Also Read: TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు