Sabarimala: కేరళలోని ప్రసిద్ధ క్షేత్రం శబరిమల కోసం అయ్యప్ప స్వాములు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. అయితే స్వామి దర్శనానికి శబరిమలకు వచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు ఉండటం లేదని.. ఫలితంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వెల్లువెత్తుతున్నాయి. ఇక కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే మండల-మకరవిళక్కు వార్షిక ఉత్సవాల సందర్భంగా భక్తులు వస్తుండటంతో శబరిమల అయ్యప్ప క్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. Also Read: సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి బిగ్ షాక్... ఛార్జీలను పెంచిన ఆర్టీసీ ఈ క్రమంలోనే తాజాగా కేరళలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. రూ.1033.62 కోట్లతో తయారు చేసిన శబరిమల మాస్టర్ ప్లాన్‌కు కేరళ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది.కేరళలోని శబరిమలలోని స్వామి సన్నిధానంతో పాటు, పంబ, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పినరయి విజయన్ ఆమోదించింది. Also Read: KTR: ముగిసిన కేటీఆర్ విచారణ.. మీడియాతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు మొత్తం రూ.778.17 కోట్ల వ్యయంతో అయ్యప్ప ఆలయ ప్రాంతాన్ని 3 దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. మొదటి దశ పనులకు రూ. 600.47 కోట్లు.. 2028-2033 మధ్య చేపట్టే సెకండ్ టెర్మ్ పనులకు రూ. 100.02 కోట్లు.. 2034-2039 మధ్య చేపట్టే మూడో దశ పనులకు రూ.77.68 కోట్లు కేటాయించనున్నట్లు కేరళ మంత్రివర్గం ప్రకటించింది. అయితే ఈ శబరిమల మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి కారణంగా.. అయ్యప్ప సన్నిధానం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఎలాంటి భంగం కలగకుండా లేఅవుట్ ప్లాన్ రూపొందించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 8 జోన్‌లుగా... ఇక ఈ శబరిమల ప్రాంతాన్ని మొత్తం 8 జోన్‌లుగా విభజించినట్లు కేరళ ప్రభుత్వం చెప్పింది.మకరవిళక్కు దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా.. భక్తుల రద్దీని నియంత్రించేలా రెండు ఓపెన్ ప్లాజాలు నిర్మించనున్నట్లు సమాచారం. మరోవైపు.. అటవీ మార్గంలో శబరిమలకు చేరుకునే యాత్రికుల సంరక్షణ, సౌకర్యం కోసం వాహన రూట్ లేఅవుట్ ప్లాన్‌ను కూడా సిద్దం చేశారు. ఆ మార్గంలో షెల్టర్లు, విశ్రాంతి భవనాలను నిర్మించనున్నారు. రోడ్డుకు రెండు వైపులా అత్యవసర వాహన లేన్, పర్యావరణ పునరుద్ధరణ కోసం బఫర్ జోన్‌లతో సమగ్ర ప్రణాళికలను రెడీ చేశారు. రూ. 47.97 కోట్ల వ్యయంతో ట్రక్ రూట్ అభివృద్ధి పనులను మొదలుపెట్టనున్నారు. తొలి దశ పనులకు రూ.32.88 కోట్లు.. రెండో దశ పనులకు రూ.15.50 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. పంబ అభివృద్ధికి రూ.207.48 కోట్లు ఖర్చువుతుందని అధికారులు అంటున్నారు. ఇందులో మొదటి దశకు రూ. 184.75 కోట్లు.. 2028-2033 మధ్య రెండో దశ పనులకు రూ.22.73 కోట్లు ఇవ్వనున్నారు. శబరిమల మాస్టార్ ప్లాన్ ప్రకారం.. పంబ, ట్రక్ రూట్ డెవలప్‌మెంట్‌కి కలిపి మొత్తం రూ. 255.45 కోట్లు ఖర్చవుతుందని కేరళ కేబినెట్ అంచనా వేసింది. Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్ Also Read: Oppo Reno 13 series: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి.. ఏంటి బ్రో ఈ ఫీచర్లు!