SC Categorization: నేడు ఎస్సీ వర్గీకరణ పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..ఏం తేల్చారంటే...

ఎస్సీ వర్గీకరణ పై ఈ రోజు ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేయనుంది. కమిషన్ నివేదిక పై సబ్ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది.

New Update
Cabinet Meeting

Cabinet Meeting

ఎస్సీ వర్గీకరణ పై ఈ రోజు ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేయనుంది.ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్‌ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ (Judicial Commission) నివేదిక పై సబ్ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై చర్చించి రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది.

ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..

కాగా ఎస్సీ వర్గీకరణ (SC Categorization) పై సుదీర్ఘంగా కొనసాగిన విచారణ అనంతరం ఆగస్టు1, 2024న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  (Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సమావేశమై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించింది. కాగా జస్టిస్ షమీం అక్తర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేశారు. అధ్యయనం ముగియడంతో ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేయనుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాడు జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం ఆమోదించడానికి సిద్ధపడింది.

Also Read: Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!

SC Categorization

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం కోసం ప్రభుత్వం బీసీ కులగణన చూపట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రేపు (మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్‌ తో పాటు ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రివర్గం ఆమోదం అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. అలాగే ఎస్సీ వర్గీకరణపైనా అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకోనుంది.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సీ వర్గీకరణ పై ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ ఇచ్చిన సిఫారసులపై సబ్ కమిటీ ఛైర్మన్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు,  పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  

Also Read: Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

Also Read :  ISRO శ్రీహరి కోట నుంచి చేసిన 100వ ప్రయోగానికి అవరోధం

Advertisment
తాజా కథనాలు