తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ కోరింది. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో 2023 నవంబరులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ హోమం కోసం ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేస్తోంది. టికెట్ ధర రూ.1000 కాగా.. ఒక టికెట్‌పై ఇద్దరికి అనుమతి ఉంటుంది. Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ వారే మా బ్రాండ్ అంబాసిడర్లు..! టీటీడీకి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్ లని టీటీడీ ఈవో జే శ్యామలరావు అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఉద్యోగుల సమావేశంలో పలు సూచనలు చేశారు. టీటీడీలో సమిష్టిగా పనిచేసే పటిష్టమైన యంత్రాంగం ఉందని తెలిపారు. ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినట్లు చెప్పారు. Also Read: TS: గ్రామ పంచాయతీల ఉద్యోగులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త! వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు మరింతగా మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు.వాట్సాప్ లో అన్ని ముఖ్యమైన అంశాలను సిబ్బంది మొబైల్‌లకు పంపుతారని, తద్వారా భక్తులకు సరైన పద్దతిలో మార్గనిర్దేశం చేయాలని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వస్తున్నారని, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సేవలు అందించడం ప్రతిరోజూ సవాల్ తో కూడిన అంశమన్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజులు చాలా సున్నితమైనవని, ఈ ప్రధాన రోజుల్లో భక్తులతో మమేకం కావడానికి మరింత ఓర్పు, నైపుణ్యంతో కూడిన కార్యాచరణ అవసరమని అధికారులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన టీటీడీ సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఉద్యోగులు కొన్ని నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. సంప్రదాయ దుస్తులు ధరించాలని, మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, యాత్రికులకు పార్కింగ్ స్థలాలు, వేచియుండే పాయింట్లలో సరైన పద్ధతిలో మార్గనిర్దేశం చేయాలన్నారు. Also Read: Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా Also Read: L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!