Tirumala : తిరుమలలో అపచారం.. ఆలయ గోపురం మీదుగా విమానం.. TTD ఆగ్రహం
తిరుమల దేవస్థానం గోపురం పైనుంచి గురువారం విమానం ప్రయాణించింది. ఆగమన శాస్త్ర నిబంధన ప్రకారం గుడిపై నుంచి విమాన రాకపోకలు నిషేదం. దీంతో టీటీడీ వేద పండితులు, భక్తులు విమానయాన శాఖపై మండిపడుతున్నారు. గతంలోనే ఇలా మరోసారి జరగొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉన్నత ప్రమాణాలతో వసతి ఏర్పాట్లు
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించారు. మొత్తం రూ.772 కోట్లతో 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు పాలకమండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో ఆ షాపులు క్లోజ్!
టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు.
Tirumala Darshan: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల..ఎప్పుడంటే
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్న్యూస్. జూన్ 2025 కోటాకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. టికెట్లు రేపటి నుంచి అనగా మార్చి 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Tirumala: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. గాజు సీసాలతో తలలు పగలకొట్టుకున్న భక్తులు!
తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది.
అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు
AP: తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన
మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాల్ని వడ్డించనున్నారు.
TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు.