/rtv/media/media_files/2025/08/12/ttd-2025-08-12-15-18-03.jpg)
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లుగా టీటీడీ పేర్కొంది. ఫాస్టాగ్ లేని వాహన దారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
భారీ విరాళం
ఇదిలావుంటే హైదరాబాద్ కు చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.