/rtv/media/media_files/2025/09/08/thives-2025-09-08-20-11-49.jpg)
భోపాల్(Bhopal) లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చోరీ చేసిన సొమ్ముతో పారిపోతున్న దొంగలు(thieves) రూ. 2 లక్షల విలువైన బైక్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన భోపాల్‌లోని అయోధ్య నగర్ ప్రాంతంలో జరిగింది. నీరజ్ అనే ఓ కిరణా వ్యాపారి రాత్రి 11 గంటల ప్రాంతంలో తన దుకాణాన్ని మూసివేసి బైకుపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతని వద్ద ఉన్న క్యాష్ బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నీరజ్ స్కూటర్ బోల్తా పడింది, దీంతో అతని వద్ద ఉన్న బ్యాగ్ దొంగల చేతులోకి వెళ్లిపోయింది. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోవడానికి తమ బైకును తిరిగి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా అది స్టార్ట్ కాలేదు.
Also Read :మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం.. భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య
నీరజ్ కేకలు వేయడంతో
మరోవైపు దొంగ దొంగ అంటూ నీరజ్ కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోగా, దొంగలు భయాందోళనకు గురై, తమ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. తరువాత పోలీసులు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ దాదాపు రూ. 2 లక్షలు ఉంటుందని, దాని రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ముఠాను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది, కేసును త్వరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త నెట్టింట వైరల్ కాగా.. అంతా బాగైంది దొంగలకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : 15 రోజుల శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయిన తల్లి.. చివరకు ఏమైందంటే?