/rtv/media/media_files/2025/09/07/madhya-pradesh-2025-09-07-07-43-52.jpg)
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. "శుక్రవారం అర్థరాత్రి ఇండోర్‌లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు" అని కాంగ్రెస్ పార్టీ X వేదికగా పోస్ట్ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
#Breaking
— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025
Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.
Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl
పశ్చిమ బెంగాల్‌లో విచిత్ర ఘటన
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అత్తమామలకు మత్తు మందు ఇచ్చి ఎదురింటి వ్యక్తితో పారిపోయారు ఇద్దరు తోటి కోడళ్లు. నార్త్ 24 పరగణాలలోని బాగ్డా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మలిడా గ్రామానికి చెందిన యాసిన్ షేక్, అనిసూర్ షేక్ సోదరులున్నారు. వీరి భార్యలు కుల్చన్ మల్లిక్, నజ్మా మండల్. అయితే వీరిద్దరూ ఎదురింట్లో ఉంటున్న వివాహితుడైన ఆరిఫ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆరిఫ్ తన భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు.
సోమవారం అత్తమామలు, పిల్లలకు టీలో మత్తు మందు ఇచ్చిన కోడళ్లు.. తమ భర్తలను కూడా వదిలేసి ఆరిఫ్‌తో వెళ్లిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న అనిసూర్ బాగ్డా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారి దర్యాప్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ నెట్‌వర్క్ సమాచారం ఆధారంగా మహిళలను గుర్తించి వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా అనిసూర్ ఒక గ్యారేజీలో పనిచేస్తుండగా, యాసిన్ షేక్ విదేశాల్లో ఉన్నారు.
అయితే కౌన్సిలింగ్ లో ఇద్దరు కోడళ్లు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. తాము ఇద్దరం అతన్ని ప్రేమించామని తమకే అతగాడే కావాలని ఇద్దరూ చెప్పడం గమనార్హం. అయితే ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం ఏంటంటే.. అతగాడి కోసం వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను చంపలేదు. ఇతరులను ఇన్సిసిరేషన్ గా తీసుకుని ఉంటే తమ ప్రాణాలు పోయేవని అంటున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.