అనంతపురంలో.. దొంగల బీభత్సం | Robberies in Ananta puram | RTV
Anantha puram Rural Police arrests the accused called Agraharam Ranga Swami as they suspect him for earlier Robberies in Ananta Puram and surrounding Areas | RTV
Anantha puram Rural Police arrests the accused called Agraharam Ranga Swami as they suspect him for earlier Robberies in Ananta Puram and surrounding Areas | RTV
ప్రధాని మోదీకి దొంగలు షాక్ ఇచ్చారు. ఆయన బాంగ్లాదేశ్ పర్యటనలో సత్ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటాన్ని దొంగలు కొట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుకు.. దొంగల కోసం వెతుకుతున్నారు.
26 కేసుల్లో నలుగురు దొంగలను, దొంగ మోటార్లు కొనుగోలు చేస్తున్న మరోవ్యక్తిని గరిడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి దగ్గర నుంచి 4.34 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ ను అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.
ఓ మినీ బస్సు మీద దారి దోపిడీ దొంగలు అటాక్ చేశారు కాల్పులు జరిపారు. అయినా డ్రైవర్ అప్రమత్తత వల్ల బస్సులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చేతికి బుల్లెట్ గాయమైనా ౩౦కి.మీ బస్సు నడిపి శభాష్ అనిపించుకున్నారు మహారాష్ట్రలోని డ్రైవర్.
ఊరి చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర మూడు లక్షల నగదు, రెండు లారీలు, చేతి పంపులు, పైపు, డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.