KCR: బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో శుభకార్యానికి హాజరైన కేసీఆర్ దంపతులు-VIDEO
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బీజేపీ నేతలు కర్రలు, రాడ్లతో తనపై దాడికి యత్నించారని APPCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తన మీద జరిగిన దాడికి BJP క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు నిరసన సెగ తగిలింది. ఈ రోజు సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ జిల్లా స్థాయి సమావేశంలో MLAకు వ్యతిరేకంగా పలువురు నేతలు ఆందోళనకు దిగారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తో కలిసి వివాహ వేడకకు హాజరయ్యారు.
తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2.15 గంటలకు కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేశారు.
తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. నేను చచ్చానా? అంటూ ప్రశ్నించారు. మంత్రి తుమ్మల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా MLA శాంతించలేదు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి మాట్లాడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. నరేందర్ మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే రెండు సినిమాలు తీయాలి కానీ.. కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లొడద్దన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు.
విజయవాడలో రేపు జరగనున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఈ ఇరువురి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.