మంచి వయస్సులో ఉన్న యువతీ యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే వారు తప్పులు చేసే అవకాశం ఉందని సీపీఐ నారాయణ అన్నారు. ఇలాంటి చెడు సంస్కృతికి తాము వ్యతిరేకమన్నారు. బిగ్ బాస్ పై పోలీసులు స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా కోర్టు పిల్ స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హై కోర్టులో పిల్ వేస్తే స్వీకరించి నాగార్జున, ఎండీకి నోటీసులు జారీ చేశారన్నారు. వారందరినీ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని కోరిందన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకొని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
అందాల పోటీలు వద్దు..
హైదరాబాద్ లో అందాల పోటీలను ఏర్పాటు చేయడం.. ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లేనన్నారు. ప్రపంచ సుందరిని వివిధ రకాల నాసిరకం వస్తువులను అమ్ముకోవడానికి బ్రాండ్ అంబాసిడర్ గా వినియోగించి సేల్స్ పెంచుకుంటారన్నారు. చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయండనే సందేశాన్ని ఇలాంటి షోలు ఇస్తున్నాయన్నారు. మన దేశంలో ఉన్న కుటుంబ సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతి చూస్తే మనం మనపై వాత పెట్టుకున్నట్లేనన్నారు.
(cpi-narayana | big-boss | telugu-news | telugu breaking news)