ఈనెల 10 నుంచి హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
హైదరాబాద్ లో ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది.
— Jupally Krishna Rao (@jupallyk_rao) May 5, 2025
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు… pic.twitter.com/gOCkeJFNTB
బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేయండి..
తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Miss World 2025: హైదరాబాద్‌కు అందాల తారలు.. ఫొటోలు చూశారా?
(Miss World 2025 hyderabad | cm-revanth-reddy | telugu-news | telugu breaking news)