పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. ఇందుకు కారణమైన పాక్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం మంత్రులు, రక్షణ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పాక్ పై దాడి జరగొచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్ కు చెందిన మంత్రులు సైతం తమ దేశంపై దాడులు జరగుతాయని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లోనే దాడులు జరుగుతాయని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. బార్డర్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు నిత్యం పాక్ సైనిక విన్యాసాల పేరిట కవ్పింపు చర్యలకు పాల్పడుతోంది.
ఇది కూడా చదవండి:Pakistan : పాకిస్థాన్ కవ్వింపు చర్యలు...మరోసారి కాల్పులు
ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తోన్న భారత్.. మరోవైపు పాకస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ క్రమంలో ప్లాన్-A, ప్లాన్-Bతో భారత్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పీఓకేను స్వాధీనం చేసుకుని కశ్మీర్ సమస్యకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టడం ప్లాన్-A కాగా.. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ప్లాన్-B. అయితే.. ఏ క్షణమైనా దాడి జరగొచ్చనే అంచనాలతో పాక్ సైతం అప్రమత్తం అవుతోంది. 
ఇది కూడా చదవండి:Heavy Security to Hafiz Saeed : పహల్గాం దాడుల వేళ..ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత
సైరన్లు ఏర్పాటు చేసిన పాక్..
భారత్ నుంచి వైమానిక దాడులు జరుగుతాయన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో పాక్ జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు 30 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తోంది పాక్ ప్రభుత్వం.ఖైబర్ పఖ్తున్ఖ్వా ఏరియాలో వందలాది ఉగ్రవాదులు దాక్కున్నట్లు భారత్ వద్ద సమాచారం ఉంది. గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను ఇక్కడే అమెరికా హతమార్చింది. ఇప్పుడు ఉగ్రవాది హఫీజ్ సయ్యద్‌ను లేపేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులకు కంటికి రెప్పలా కాపాడుకునే పాక్ ఇప్పుడు.. హఫీజ్ సయ్యద్ కు కూడా హైసెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
(Pahalgam Attack latest news | telugu-news | telugu breaking news | ind pak war updates)
 Follow Us