ఇది రేవంత్ సర్కార్ విక్టరీ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్!

దేశంలో కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీ కే దక్కుతుందని కొనియాడారు. కులగణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని అభివర్ణించారు. తెలంగాణ మోడల్ ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందన్నారు.

New Update

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ మంత్రులు, నేతలతో కలిసి  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ధన్యవాదాలు తెలిపామన్నారు.

రాహుల్ ఆశయం నెరవేరింది..

కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీ కే దక్కుతుందని కొనియాడారు. కేంద్రం జనగణన తో పాటు కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని అభివర్ణించారు. తెలంగాణ మోడల్ ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందన్నారు. కుల గణన పై కేంద్రం నిర్ణయం తో రాహుల్ ఆశయం నెరవేరిందన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కుల గణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందన్నారు. 

(caste census india | telugu breaking news | telugu-news | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు