గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్
TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
TG: హైదరాబాద్ కూకట్ పల్లిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెయిన్బో విస్టాన్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. BRK ఛానల్ అధినేత బొల్ల రాకమృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
TG: హైడ్రా తరహాలో మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
సోమవారం మాదాపూర్లో కావూరి హిల్స్లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు.
రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,516 కొట్లకు టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.
నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ఈ నెల ఈ నెల 17న స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో వీరిని పట్టుకున్నారు.
హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో వీటిని నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రికలో వచ్చిన వార్త కథనంలోని పలు అంశాలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు.