పండుగ పూట ఇదేం దోపిడీ సారూ..? వైరల్ అవుతోన్న RTC బస్ టికెట్ల ఫొటోలు!

దసరా, బతుకమ్మ ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులకు దోచుకున్నారంటూ ఆర్టీసీపై ప్రయాణికులకు బగ్గుమంటున్నారు. టికెట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దోచుకుంటారా? అంటూ భగ్గుమంటున్నారు.

New Update
TGSRTC Fare Hike

దసరా పండుగ వేళ టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులు అన్న సాకుతో టికెట్ రేట్లను ఇష్టారీతిగా పెంచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల కొద్దీ ధరను పెంచడం ఏంటని ఫైర్ అవుతున్నారు. టికెట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. TGSRTCతో పాటు సంస్థ ఎండీ సజ్జనార్ ను ట్యాగ్ చేస్తూ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణకు మరో సంచలన అధికారి.. రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?

అప్పుడు రూ.300 ఉంటే ఇప్పుడు రూ.420..

దసరా, బతుకమ్మ పండుగ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే.. పండుగ వేళ రూ.420కి పెంచారని ఒకరు పోస్ట్ చేశారు. డీలక్స్ బస్సు ఛార్జీ రూ.260 ఉంటే నేడు రూ.360 చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: TGPSC Group-1: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

తిరుగు ప్రయాణంలో పెంచారని మరొకరు..

టికెట్ ధర రూ.140తో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి అంటూ మరొకరు పోస్ట్ చేశారు. మరో వైపు రద్దీకి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైందన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తప్పనిపరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ పలువురు ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే?

హరీశ్ రావు ఆగ్రహం..

ఈ అంశంపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సైతం స్పందించారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనా? అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు