రైతులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. వాటి మద్దతు ధర పెంపు!
తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Mallikteja: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు..!
యూట్యూబ్ ఫేం, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదైంది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మల్లిక్ పై విచారణ చేపట్టారు.
KTR: కేటీఆర్‌కు అస్వస్థత!
TG: మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటల నుంచి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు.
మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు.. ఆ అంశంపై ప్రశ్నల వర్షం!
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు
TG: కేటీఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ సర్కారు తన కంపెనీ శోభ కన్స్ట్రక్షన్కు ఇచ్చిన అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 30రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు.
గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్
TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
/rtv/media/media_files/tFJsIPh9JGM1ER7g4Qpy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tummala-1-jpg.webp)
/rtv/media/media_files/oJj1mOWwbA8xTLvaaqyH.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/BRS-Working-President-KTR.jpg)
/rtv/media/media_files/Pco8xPWYwOypFyD2tDTd.jpg)
/rtv/media/media_files/nnJgChJGuyEHc8qJPUrM.jpg)
/rtv/media/media_files/RyxSWXyYuBrH1AO81dLj.jpg)
/rtv/media/media_files/49Bzkof9EeHHrTCek0sj.jpg)
/rtv/media/media_files/NvOiGmANRf4PBtYBYVw2.jpg)