/rtv/media/media_files/cx7KddprejCzWZyXpKW5.jpg)
Musi River Area: తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపట్టింది. దీనిలో బాగంగా మూసీ చుట్టూ ఉన్న ఇళ్ళను తొలగిస్తోంది. మూసీ నదిని ఆక్రమించుకుని కట్టుకున్నారని అందుకే ఇళ్ళను తొలగిస్తున్నామని చెప్పింది. ఇక్కడ ఇళ్ళను పోగొట్టుకున్న వారికి టూ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తామని కూడా చెప్పింది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయిన వారికి మాత్రం ఈ మార్పు రుచించడం లేదు. తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నామని...బోలెడంత డబ్బులు పెట్టుకుని ఇండ్లు కట్టుకున్నామని...ఇప్పుడు మా సొంత స్థలాలను, ఇళ్ళను వదిలేసి వెళ్లిపోమంటే ఎలా అంటూ వాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా...ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఈ తగువు నడుస్తోంది.
Also Read: తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!
స్టే తెచ్చుకున్న యజమానులు..
మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మూసీ సుందరీకరణ పనులు చేపట్టింది. దానిలో భాగంగా ఇళ్ళను కూల్చేందుకు వెళ్ళింది. అయితే చాలా ఇండ్ల దగ్గర హైకోర్టు స్టే బోర్డులు కనిపిస్తున్నాయి. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో చాలా ఇళ్ళ ముందు ఇవి దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇండ్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్ళను ఇచ్చే ప్రసక్తే లేదని...న్యాయ పోరాటం కోసం ఎక్కడిదాకైనా వెళతామని వారు చెబుతున్నారు.
The Telangana High Court has issued a stay order on the demolition of 100 homes in the Musi River catchment area, including #Chaithanyapuri, #Phanigiricolony, #Sathyanagar, and #Kothapeta. Homeowners have displayed banners and posters indicating that their properties are… pic.twitter.com/cX4pQYCCkH
— V Chandramouli (@VChandramouli6) October 14, 2024
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు!
చేసి తీరుతాం అంటున్న ప్రభుత్వం..
అయితే ప్రభుత్వం మాత్రం ఈ పనులు ఎలా అయినా చేసి తీరుతామని అంటోంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ ఇటీవల తెలిపారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!
Also Read: నాకు ముందే మెసేజ్ వచ్చింది.. ఉప్పల్ సెంచరీపై సంజూ టాప్ సీక్రెట్!