బీరు సీసాల్లో ఐఈడీ బాంబ్‌.. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల బిగ్ స్కెచ్

అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసులను హతమార్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప అడవుల్లో బీరు సీసాల్లో ఐఈడీ మందుపాతరలను పాతిపెట్టారు. వాటిని గుర్తించి భద్రతాబలగాలు పేల్చేశాయి.

New Update
ftdrtrt

Maoist: అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు బీకర దాడులు చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు బలగాలను అంతమొందించేందుకు పలుచోట్ల మందుపాతరలను పాతిపెడుతున్నారు. భద్రతాబలగాలు తిరిగే ప్రాంతాల్లో ఏకంగా బీరు సీసాల్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సమీప అడవుల్లో భద్రతా బలగాలు పలు మందుపాతరలను గుర్తించినట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్‌-81 బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా వాటిని వెలికి తీసి పేల్చేశారు. 

ఇది కూడా చదవండి:  Kenya : కెన్యాలో పంచాయితీ పెట్టిన అదానీ.. అసలేమైందంటే?

మోస్ట్ వాంటెడ్ హిడ్మా..

ఇక ఈ ఘటనపై సీఐ రాజువర్మ పూసుగుప్ప క్యాంపులోని సీఆర్పీఎఫ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల తమ సహచరులను చంపినందుకు ప్రతీకారంగా మందుపాతర పేల్చేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నామని రాజువర్మ తెలిపారు. భద్రాద్రి-కొత్తగూడెం పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక మోస్ట్ వాంటెడ్ సీపీఐ (మావోయిస్ట్) సభ్యుడు మద్వి హిడ్మాను కీలక కుట్రదారుల్లో ఒకరిగా పోలీసులు ప్రకటించారు. సీపీఐ (మావోయిస్ట్‌)కి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)లో కమాండర్‌గా ఉన్న హిడ్మాపై రూ.25 లక్షల రివార్డు ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్, దక్షిణ బస్తర్ కార్యదర్శి వికాస్, మరో 20 మంది మావోయిస్టులు నిందితుల లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Supreme Court: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ముగ్గురు వ్యక్తులపై దాడి.. 

శుక్రవారం, అడవిలో కూంబింగ్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా భద్రతా బలగాలు ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు. ఇద్దరు తప్పించుకోగా మూడో నిందితుడు పట్టుబడ్డాడు. అతని బ్యాగ్‌ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు నింపిన టిఫిన్ బాక్స్‌ను పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు ఛత్తీస్‌గఢ్‌లోని మల్లంపేట నుండి బయలుదేరి చెర్ల వైపు వెళుతుండగా లెనిన్ కాలనీ వద్ద పట్టుబడ్డారు. అరెస్టయిన వ్యక్తి పేరు కోసయ్య. అతను యాక్షన్ కమిటీ సభ్యుడు (ఏసీఎం)గా వెల్లడించాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ పోలీసులు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఆరుగురు మావోయిస్టులను కొత్తగూడెం పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి:  Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?

మావోయిస్టు నేతల సమావేశం.. 

ఇటీవల మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన దామోదర్, ఆజాద్, ఇతర సీనియర్ మావోయిస్టులతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడ్మా, వికాస్, పలువురు మావోయిస్టు నేతలు సమావేశమయ్యారని కోసయ్య అంగీకరించారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లకు ప్రతిగా ఎదురుదాడికి దిగాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మందుపాతర కోసం పేలుడు పదార్థాలను వారికి అప్పగించినట్లు కొత్తగూడెం జిల్లా పోలీసులు తెలిపారు. కోసయ్య ఇతర నిందితులపై కుట్ర, పేలుడు పదార్థాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ఉల్లంఘన అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు

Advertisment
Advertisment
తాజా కథనాలు