Group-1: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్
గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలవురు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్ చేయించాలని కోరారు.
YS Viveka murder case: తెలంగాణ హైకోర్టు CBIకి నోటీసులు..!
YS వివేకా హత్య కేసు CBI కోర్టు విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని YS సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. CBI అధికారులు, కేసులో నిందితులను ప్రతివాదులుగా చేర్చి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు వారికి నోటీసులు పంపేందుకు అనుమతి ఇచ్చింది.
Betting Apps Case: తెలంగాణ హైకోర్టుకు యాంకర్ శ్యామల!
బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజే విచారణ జరగనుంది. Andhra365 గేమ్ ప్రమోట్ చేసిన శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
KTR Drone Flying Case: ఆ కేసును కొట్టివేయండి.. హైకోర్టుకు కేటీఆర్
మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించిన సందర్భంలో తనపై మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. ఈ మేరకు థియేటర్లలో స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి సవరించింది. 16 ఏళ్ల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని అందులో పేర్కొంది.
BIG BREAKING: కోర్టులోనే కన్నుమూసిన మరో న్యాయవాది!
సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న హైకోర్టులో వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.
HYDRA: హైడ్రాకు హైకోర్టు షాక్.. సీరియస్ కామెంట్స్!
హైడ్రాకు హైకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది. ‘ఎన్నిసార్లు చెప్పినా.. మీరు మారరా?’ అంటూ ధర్మాసనంఫైర్ అయింది. అక్రమ నిర్మాణమంటూ శుక్రవారం నోటీసులిచ్చి, వివరణకు శనివారం ఒక్కరోజే సమయమిచ్చి, ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత తొందరేముంది? అని ప్రశ్నించింది.
TG high court: 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ సమయంలో థియేటర్లకు అనుమతించొద్దు: హైకోర్టు
సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.