BIG BREAKING :  కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్..CBI విచారణకు బ్రేక్

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
harish and kcr

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణపై పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్ లో కోరారు. కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడాతమంది.  అప్పటి వరకు కమిషన్ ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని కోర్టు ఆదేశించింది. 

కాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో NDSA గుర్తించిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు, దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నా అని సీఎం అన్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా రేవంత్ సర్కార్ జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.

కవిత ఆరోపణలు 

కేసీఆర్‌పై అవినీతి మరకలు రావడానికి మాజీ మంత్రి హరీశ్ రావు,మాజీ ఎంపీ సంతోష్ రావులే కారణమని ఎమ్మె్ల్సీ కవిత ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వారి స్వార్ధం వాడుకున్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ కొందరు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను ప్రశ్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హరీశ్ రావు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసే ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించారని కవిత చెప్పుకొచ్చారు. 

Also Read : Instagram love : ఇన్‌స్టా ప్రియుడికోసం..కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య...కోపంతో భర్త ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు