/rtv/media/media_files/2025/08/22/harish-rao-2025-08-22-12-34-20.jpg)
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) లకు తెలంగాణ హైకోర్టు(telangana-high-court) లో బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) రిపోర్టుపై చర్యలకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. కేసీఆర్(KCR), హరీష్‌రావు ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.
కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు..
— s5news (@s5newsoffical) August 22, 2025
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు.
విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు ఆదేశం జారీ చేసింది.
ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో… pic.twitter.com/WBuGhZLU1Y
Also Read : గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్
ప్రభుత్వంపై ఫైర్
ఈ సందర్భంగా ప్రభుత్వంపైన కూడా హైకోర్టు ఫైర్ అయింది. ముందస్తుగా మీడియా సమావేశం నిర్వహించి, ఆ తరువాత 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్ నుండి వెంటనే 60 పేజీల రిపోర్ట్ తొలగించాలని ఆదేశించింది. కమిషన్ 8B, 8C నోటీసులు ఇవ్వకుండా పిటీషనర్లపై ఆరోపణలు చేయడాన్ని చట్ట విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రానున్న రోజుల్లో ఈ నివేదికలోని అంశాలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.
*బిగ్ బ్రేకింగ్*
— Veerla (@MeetVeerla) August 22, 2025
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో సీఎం, రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహాన్ని తప్పు పట్టిన హైకోర్టు.
ముందస్తుగా సీఎం మీడియా సమావేశం నిర్వహించి, 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టడాన్ని తప్పు బట్టిన హైకోర్టు
అన్ని పబ్లిక్ డొమైన్ నుండి వెంటనే 60 పేజీల రిపోర్ట్ తొలగించాలని… pic.twitter.com/JzSUigcjmB
Also Read : ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. ఆ విధుల్లో ఇక వారే...