SC MLAs : పట్టుపట్టి సాధించిన ఎస్సీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎస్సీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద వారి పోరాటం ఫలించింది. ఎట్ధకేలకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కింది.