తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. కొత్త కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులను తీసుకోవడంతో ఇంతకుముందున్న మంత్రుల శాఖలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరి కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పుపై ప్రకటన వెలువడనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ తనకొద్దంటున్నట్లు తెలుస్తోంది. తనకు హోం శాఖ ఇవ్వాలని భట్టి విక్రమార్క మనసులో మట భయటపెట్టారట.
గడ్డం వివేక్ అనే నేను
— Telangana Rising (@TGRisingN01) June 8, 2025
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను
వాకిటి శ్రీహరి అనే నేను..
తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురు మంత్రులు.. #TelanganaCabinet#TelanganaCabinetExpansionpic.twitter.com/oQZSFzUDX0
ఉత్తమ్ కుమార్‌కు షాక్.. శ్రీధర్ బాబుకు సర్‌ప్రెస్
ఇక మంత్రి శ్రీధర్ బాబుకు ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్న సివిల్ సప్లై శాఖ మరొకరికి కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త మంత్రుల్లో వాకిటి శ్రీహరికి ఫిషరీష్, పశు సంవర్ధక శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ సంక్షేమ శాఖ, గడ్డం వివేక్‌కు కార్మిక శాఖ, ఉపాధి, మానవ వనరుల శాఖ కేటాయించనున్నారు.