/rtv/media/media_files/2025/07/10/telangana-cabinet-meeting-2025-07-10-20-35-39.jpg)
Telangana Cabinet Meeting
తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం సాగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలను చర్చించామని.. వీటిలో 323కి ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. రెండు వారాలకొకసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలో రెండు విద్యాసంస్థలను యూనివర్సిటీలుగా మార్చేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఇందులో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఉంటాయన్నారు. అమిటీ, సెంటినరీ రిహాబిలేషన్ ఇన్‌స్టిట్యూట్‌లను యూనివర్సిటీలుగా మార్చేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.గోశాల పాలసీ తీసుకురావాలని నిర్ణయించామన్నారు.
Also read: సంగారెడ్డిలో హైటెన్షన్.. స్కూల్ బస్సులో మంటలు.. స్పాట్లో ఐదుగురు స్టూడెంట్స్!
ఇదిలాఉండగా.. త్వరలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు