/rtv/media/media_files/2025/07/01/dharmapuri-arvind-2025-07-01-12-05-44.jpg)
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు జరిగే రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు తాను హాజరుకావడం లేదని ప్రకటించారు. బీజేపీ అధ్యక్ష పదవిని రాంచంద్రరావుకు అప్పగించడంతోనే ఆయన ఈ రకంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచంద్రరావుకు హైదరాబాద్ లోని వేద కన్వెన్షన్ లో ఈ రోజు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: యుద్ధానికి సిద్ధం.. పాదయాత్ర చేస్తా: ఈటల
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 1, 2025
ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ హాజరు అవుతారా? కారా? అన్న అంశంపై బీజేపీతో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాలికి శస్త్ర చికిత్స కావడంతో రఘునందన్ రావు హాజరుకావడం లేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈటల, అర్వింద్ పై ఉంది. ఈ క్రమంలో ఈ రోజు జరిగే పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొనడం లేదని అర్వింద్ ప్రకటించి బీజేపీలో బాంబు పేల్చారు.
ఇది కూడా చదవండి: Raja Singh: రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన బీజేపీ.. షాకింగ్ కామెంట్స్!
Wholeheartedly extending my support to the party’s nominee for the presidential post of @BJP4Telangana.#BJP4Telangana pic.twitter.com/ovu7hklhtB
— Arvind Dharmapuri (@Arvindharmapuri) June 30, 2025
ఈటల హాజరు?
నిన్నంతా మీడియాకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్.. నేడు రాంచంద్రరావు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధ్యక్ష పదవిపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న ఈటల ఇప్పుడు పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారన్న ప్రచారం సాగుతోంది.
రాజాసింగ్ రాజీనామా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు పేరు ఖరారైన కొన్ని గంటల్లోనే పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆయన ఆరోపించారు. అయితే.. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నేతలెవరూ ప్రయత్నించడం లేదు.