Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!

ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

author-image
By Nikhil
New Update
Bandi Sanjay Song

Bandi Sanjay Song

తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్ గా మారారు. తన అభిమాన నేత, ప్రధాని మోదీపై పాట పాడారు. ''నమో..నమో .. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత నాడి.. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి..'' అంటూ ఆయన పాడిన పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బండి సంజయ్.. పాట పాడడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పాట ఇప్పటిది కాదని కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికల ముందు పాడిందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఉదయం నుంచి ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు