సీఎంతో రహస్యంగా భేటీ.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ కీలక కామెంట్స్!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.  తెలంగాణలో హిందూవులు సేఫ్‌గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక  కామెంట్స్‌ చేశారు.  

New Update
Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.  తెలంగాణలో హిందూవులు సేఫ్‌గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక  కామెంట్స్‌ చేశారు.  కేంద్ర అధికారులు దీనిపైన ఆలోచన చేయాలన్నారు.  తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆ సీఎంతోని బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.  వాళ్లందరికీ రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ వెల్లడించారు.  

Also read :  హమ్మయ్యా, గండం గట్టెక్కినట్టేనా.. చాలా రోజుల తర్వాత లాభాల్లో స్టాక్ మార్కెట్

Also read :  ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

సీఎం రేవంత్‌పై ఫైర్

ఇక సీఎం రేవంత్‌పై మండిపడ్డారు రాజాసింగ్. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు. రాష్ట్రంలో హోలీ ఆంక్షలపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిజాం పాలనలా కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందన్న ఆయన.. సీఎం రేవంత్‌ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.  హోలీ మధ్యాహ్నం 12 గంటల వరకే  జరుపుకోవాలన్న నిబంధన ఎందుకని రాజాసింగ్ ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి అని ఆరోపించారు.  హిందువుల జోలికి వస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని రాజాసింగ్ హెచ్చరించారు.  

Also Read :  బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

Also read :  Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళన నిరసన.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు