Kadapa: కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: అంబటి రాంబాబపై టీడీపీ విమర్శలు చేసింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న ఆయన నియమానాలను పక్కకి పెట్టి పార్టీ జెండా, జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్‌ను షార్ట్‌కు పెట్టుకొని వచ్చారని ఫైర్ అయింది. అంబటిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారని పేర్కొంది.
AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.
ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.
AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు.
AP: జగన్‌ను విమర్శిస్తూ ఎక్స్‌లో టీడీపీ మరో పోస్ట్ చేసింది. హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ ట్వీట్ చేసింది. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని సెటైర్లు వేసింది.