AP: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు.

New Update
lokesh

టీడీపీ కార్యకర్త, తన అభిమాని అయినటువంటి శ్రీను అనే వ్యక్తి  మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన చెందారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ లోకేష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను.. శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. 

Also Read:ట్రాన్స్‌జెండర్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎస్పీ

వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం లోకేష్‌కు తెలియడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి టీడీపీ నేతలతో కలిసి తరలించారు. చివరకు ఆరోగ్యం విషమించడంతో  శనివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. శ్రీను భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పి.. స్వగ్రామానికి తరలించిన పార్టీ నేతలు.. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

Nara Lokesh Tweet

శ్రను మరణం తనను ఎంతగానో బాధించింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 'అన్నా.. అన్నా.. అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.

Also Read: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను తీరుస్తాను' అంటూ లోకేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Also Read: UP:కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

'తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏదైనా కానివ్వండి.. కుటుంబం,స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు,సన్నిహితులు.. ఎవరితోనైనా మీ బాధలను షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు' అంటూ లోకేష్‌ రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు