BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు.

New Update
minister

AP Minister: ఏపీ రోడ్లు , భవనాలశాఖ మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌ మీద విరుచుకుపడ్డారు. 
వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ తెగ బాధపడిపోతున్న జగన్‌ కి ...గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ తో పాటు ప్రతిపక్ష నాయకులు, కుటుంబ సభ్యుల పై ఆయన పార్టీ వాళ్లు పెట్టిన అసభ్యకర పోస్టులు కనిపించడం లేదా?  మంత్రి ధ్వజమెత్తారు.

Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ తప్పూ చేయని నా పైనా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. 32 రోజులు జైల్లో ఉంచింది. కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా కలవనివ్వలేదు. స్థానికంగా ఉన్న ఆళ్లగడ్డ సబ్‌ జైల్లో కాకుండా..ఎక్కడో ఉన్న ఆదోని జైల్లో ఉంచి కక్ష సాధింపు చర్యలకు దిగారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఏ ఒక్కర్నీ వదలేది లేదని మంత్రి అన్నారు.

Also Read:  Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

2014-19మధ్య రహదారుల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.14,312 కోట్లు కేటాయించి..రూ 11,468 కోట్లు ఖర్చు చేసింది. అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అధికారులు వచ్చి మన రహదారులు, భవనాలశాఖ పనితీరును సమీక్షించారు.

Also Read:  Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.16, 852 కోట్లు కేటాయించగా...రూ.7, 394 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పైగా రూ. 2,300 కోట్లు బకాయిలు పెట్టిందని వివరించారు. 

 నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మంత్రి జగన్‌ కు సవాలు విసిరారు. రోడ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరి తప్పులేంటో అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. తప్పులు చేసినందుకే భయపడి.. జగన్‌ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.

Also Read:  Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం

పౌరుషం ఉంటే...

జగన్‌ అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు మైక్‌ ఇస్తామని బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. పులివెందుల పౌరుషం ఉంటే జగన్‌ అసెంబ్లీకి రావాలని సవాలు చేశారు. జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అన్నారు. ప్రజలే పక్కన పెట్టినా జగన్‌కు సిగ్గురావడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని అన్నారు.

 దీంతో పెట్టుబడిదారులు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే చివరకు ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాదని జోస్యం చెప్పారు. పోర్టులపై జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్‌మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తప్పు చేసినవారిని కచ్చతంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు