Telangana: టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి.. ఆయనతో పాటే మల్లారెడ్డి కూడా? తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 30 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ కారణాలతో పార్టీని వీడిన బలమైన నాయకులను తిరిగి సొంత గూటికి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మేయర్ గా, ఎమ్మెల్యేగా పని చేసిన ఆ పార్టీ మాజీ నేత తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 3న ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. అయితే.. తీగలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. Also Read : TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ! రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. కాలేజీల్లో అక్రమ నిర్మాణాలు, భూ కుంభకోణాలు.. ఇలా రోజుకో వివాదం ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో కొన్ని భవనాలను సైతం కూల్చివేసింది రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నించినా.. అపాయిట్మెంట్ దొరకలేదు. దీంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా మల్లారెడ్డి సిద్ధమయ్యారన్న వార్తలు వినిపించాయి. Also Read : పులి దాడి బాధితులకు రూ.10 లక్షల పరిహారం! అప్పట్లో హస్తం గూటికి చేరుతారని టాక్.. మల్లారెడ్డే మనసు మార్చుకున్నారో? లేక కాంగ్రెస్ పెద్దలే వద్దన్నారో? తెలియదు కానీ.. ఆయన హస్తం గూటికి మాత్రం చేరలేదు. దీంతో మళ్లీ అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హడావుడి చేస్తూ వస్తున్నారు మల్లారెడ్డి. అయితే.. ఈ రోజు అనూహ్యంగా ఆయన చంద్రబాబును కలవడంతో కొత్త చర్చ మొదలైంది. మల్లారెడ్డి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో చేరడం ద్వారా కేంద్రం నుంచి సపోర్ట్ పొందొచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. Also Read : RS Praveen Kumar: చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి దీంతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సన్నిహిత్యం కూడా తనకు అనుకూలంగా మారుతుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన బిల్డింగ్ లపైకి బుల్డోజర్లను పంపించినా.. ఆస్తులపైకి అధికారులను పంపించినా చంద్రబాబుతో చెప్పించి ఆపించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఒకే సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పొందడానికి మల్లారెడ్డి స్కెచ్ వేశారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ఈ టాక్ నిజం అవుతుందా? టీడీపీలో చేరినంత మాత్రానా రేవంత్ సర్కార్ ఆయనను వదిలిపెడుతుందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Also Read : హైదరాబాద్‌లో కెమిస్ట్రీ లెక్చరర్ ప్రేమ పాఠాలు.. కాలేజీ వద్ద ఆందోళన! #mallareddy #tdp #telangana-politics #teegala-krishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి