Kadapa: కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్‌చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 07 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్‌చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమవేశాల్లో మేయర్ పక్కన కుర్చీలో ఎమ్మెల్యే కూర్చున్నారు. అయితే ఈ సమావేశాల్లో మేయర్ కుర్చీ తప్పా మిగతా అన్ని కుర్చీలను తీసివేయించారు. దీంతో మేయర్ నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పీచ్ మొదలుపెట్టగానే కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత డబ్బా వద్దు, సమస్యలపై చర్చిద్దామంటూ కేకలు వేశారు. ఇది కూడా చదవండి: Video:పెట్రోల్ పోసుకుని అఘోరీ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చేయండి అంటూ.. నిన్నటి సమావేశం వరకూ మేయర్ పక్కనే ఎమ్మెల్యేల కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఈసారి మేయర్ కు మాత్రమే కుర్చీ వేయడంతో వివాదం మొదలైంది. కార్పొరేటర్లతో పాటే ఎమ్మెల్యే సీటు ఉంచడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి దాక ఒక రూల్.. ఇప్పుడు కొత్త రూలా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే నిర్ణయాలు ఉంటాయని వైసీపీ స్పష్టం చేస్తోంది. మేయర్ కు ఉన్న అధికారాలు అమలు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సమావేశంలో ఎమ్మెల్యే అనుచరులను అనుమతించవద్దని వైసీపీ మహిళా కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా సమావేశపు హాల్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ మేయర్.. వైసీపీకి కంచుకోటగా చెప్పే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవి విజయం సాధించారు. అయితే.. కడపకు మేయర్ గా వైసీపీ నుంచి గెలిచిన సురేష్ ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే, మేయర్ కు మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు సైతం మేయర్ కార్పొరేషన్ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నాడని మాధవి ఆరోపించారు. #kadapa #tdp #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి