/rtv/media/media_files/2024/11/01/bvs04rwe5N3tNBy8rf2o.jpg)
TDP: మరోసారి మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ టీడీపీ విమర్శలు చేసింది. ట్విట్టర్ లో జగన్, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేసింది. తిరుమల పవిత్రతను జగన్, అంబటి కాలరాస్తున్నారని మండిపడింది. దర్శనానికి వెళ్ళే సమయంలో, జగన్ బొమ్మ కనపడకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబు కండువా కప్పుకున్నారని తెలిపింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. ఈ పిల్ల సైకోలు, వెంకన్న నామస్మరణ ఉండాల్సిన చోట, జగన్ భజన చేస్తారు అంటూ చురకలు అంటించింది.
Also Read : అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంబటిపై చర్యలు...
టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. "ఈ వైసీపీ సైకో బ్యాచ్ మొత్తానికి, తిరుమల వెంకన్న స్వామి అంటే, ఎందుకో ఇంత ద్వేషం. జగన్ రెడ్డి చెప్పులు వేసుకుని తిరుమల క్యూలైన్ లోకి వెళ్ళిపోతాడు. వెంకన్న అంటే నాకు నమ్మకం అని డిక్లరేషన్ కూడా ఇవ్వడు. ఈ పిల్ల సైకోలు, వెంకన్న నామస్మరణ ఉండాల్సిన చోట, జగన్ భజన చేస్తారు.
Also Read : క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR
ఈ వైసీపీ సైకో బ్యాచ్ మొత్తానికి, తిరుమల వెంకన్న స్వామి అంటే, ఎందుకో ఇంత ద్వేషం. జగన్ రెడ్డి చెప్పులు వేసుకుని తిరుమల క్యూలైన్ లోకి వెళ్ళిపోతాడు. వెంకన్న అంటే నాకు నమ్మకం అని డిక్లరేషన్ కూడా ఇవ్వడు. ఈ పిల్ల సైకోలు, వెంకన్న నామస్మరణ ఉండాల్సిన చోట, జగన్ భజన చేస్తారు.
— Telugu Desam Party (@JaiTDP) November 5, 2024
నిన్న తిరుమల… pic.twitter.com/bUiF7L89hW
Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని!
నిన్న తిరుమల వచ్చిన అంబటి, స్వామి వారి బొమ్మతో కాకుండా, జగన్ బ్యాడ్జ్ ని తన చొక్కాకి తగిలించుకుని తిరుమలలో ఊరేగాడు. సైకో జగన్ బొమ్మతో పాటు, దిక్కుమాలిన పార్టీ గుర్తు వున్న బ్యాడ్జ్‌తోనే తిరుమలలో తిరిగాడు. దర్శనానికి వెళ్ళే సమయంలో, జగన్ బొమ్మ కనపడకుండా, కండువా కప్పుకున్నాడు. తిరుమల కొండపై నియమ నిబంధనలు లెక్క చేయకుండా పార్టీ గుర్తుతో పాటు, జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జీని ధరించి మరీ అంబటి రాంబాబు శ్రీవారిని దర్శించుకోవడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలతో అంబటిపై టీడీపీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు." అని విమర్శించింది.
Also Read : హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!
Follow Us