టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | CM Chandrababu Naidu | RTV
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
AP: సీఈసీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, దీపక్ రెడ్డి లేఖ రాశారు. తాడిపత్రి అల్లర్ల బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఆ అల్లర్లలో తాను లేకపోయినా కేసు నమోదు చేశారని దీపక్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు.
రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా ఈవూరు గణేష్ ను నియమించారు.
విశాఖ షిప్పింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధీనంలో ఉన్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర13వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.
గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు లైట్లు ఆపేసి, కొవ్వత్తులు వెలిగించి వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి సహా టీడీపీ ముఖ్య నేతలంతా కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోకేష్ ఈ కార్యక్రమం నిర్వహించారు.