MLA Balakrishna: బాలయ్య ఎక్కడ? ఏపీలో కనిపించకపోవడానికి కారణమదేనా?
చంద్రబాబు అరెస్టు తరువాత బాలకృష్ణ చాలా ఎగ్రసీవ్ గా టిడిపి వ్యవహారాలు చూసుకున్నారు. బాలయ్యతో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రాజమండ్రిలో ఉంటూ పార్టీ ఆదేశానుసారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట్లో చాలా హడావిడి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు ఎందుకు ఏపీకి రావడం లేదని చర్చ మొదలైంది. ఒకవైపు బ్రాహ్మణి, భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ టిడిపిని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం హైదరాబాద్ వెళ్లిపోవడంపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు.