TDP leaders suspend: కల్తీ లిక్కర్ స్కాం‌లో TDP లీడర్ల సస్పెండ్

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ  నాయకులు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దాసరిపల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈమేరకు ఓ లేఖ విడుదల చేశారు.

New Update
TDP suspend

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ  నాయకులు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దాసరిపల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈమేరకు TDP రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సస్పెండైన నాయకులు వీరే:

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, పీటీ మండలం మల్లెలకు చెందిన కట్టా సురేంద్ర నాయుడులను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలు:

ఈ కల్తీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకే ఈ ఇద్దరు నాయకులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

కల్తీ మద్యం తయారీ కేసులో కీలక నేతలకు సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో, ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో పూర్తి విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు