chandrababu in jail day 18: సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ మీద విచారణ...17ఏ చంద్రబాబును గట్టెక్కిస్తుందా?
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను గత శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో శనివారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.