ఇది రాజకీయ సమస్య అయితే..మేమేందుకు జోక్యం చేసుకోవాలి: సుప్రీం!
ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది.
ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది.
అత్యాచార బాధితురాలి అబార్షన్ కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు ఆనందం ఇస్తుందని సుప్రీం తెలిపింది. కానీ ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు..అది ఆమె మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 19న, ఈ అంశంపై విచారణ సందర్భంగా, గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుండి తాజా నివేదికను కోరింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో ఆయనకు మంజూరు చేస్తూ జార్ఖండ్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై అగస్టు 25న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ సర్కర్ వైఖరిపై దేశ అత్యన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌ల ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వేసింది. కొంతమంది ఖైదీలకు రిమిషన్ పాలసీ ప్రయోజనం ఎందుకు వచ్చింది? అంటూ ప్రశ్నించింది.
న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు.
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది.
మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు.
Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం..