Jharkhand: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విసయంలో తాము ఏమీ జోక్యం చేసుకోమని...హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం చెప్పింది. By Manogna alamuru 02 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధం అని, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగంఇచడమే అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించిన కోర్టు... ఈడీ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోమేలని తేల్చి చెప్పింది. సీజేఐ డీవీ చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేది ధర్మసనం పిటిషన్‌ను తిరస్కరించింది. ముందుగా హైకోర్టుకు వెళ్ళాలని ధర్మాసనం సూచించింది. మరోవైపు జార్ఖండ్ నూతన సీఎంగా చంపయ్ సోరెన్ (Champai Soren) 12.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Also Read: Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా బుధవారం రాత్రి అరెస్ట్... జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ను ఈడీ (ED) బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయన తన పదవీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. చాలా సేపు విచారణ తరువాత ఈడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. హేమంత్ అరెస్ట్ తో జార్ఖండ్ రాజధాని రాంచీలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసు సిబ్బంది రాంచీలో మోహరించారు. అయితే హేమంత్ అరెస్ట్ కావడానికి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. హేమంత్ స్వయంగా రాజ్‌భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ ఊహించని సంఘటన నేపథ్యంలో జార్ఖండ్ అధికార కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజ్ భవన్ వద్దకు వచ్చారు. హైదరాబాద్‌కు చేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు భాగ్యనగరంలోని హోటల్ ఎల్లా వేదికగా ఆ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది. ప్రత్యేక విమానంలో ఇండియా కూటమికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడినుంచి గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు తరలించి అక్కడ వారికి వసతి కల్పించారు. #arrest #jharkhand #cm-hemant-soren #ex-cm #hemanth-soren #supreme-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి