/rtv/media/media_files/2025/02/21/1AxO0jazAZPldzLvNxUZ.jpg)
Numaish exhibition She Teams arrested 247 boys for misbehaving with women
Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేయడంతోపాటు ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఇందులో కొంతమందిని జైలుకు పంపిస్తుంటే మరికొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గణపతి ఉత్సవాల్లో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా చిల్లర పనులు చేస్తున్న వారిని భారీ సంఖ్యలో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
నిందితుల్లో 24 మంది మైనర్లు..
ఈ మేరకు నాంపల్లిలో జరిగిన నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్‌లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మందిని ‘షీ టీమ్స్’(‘'She Teams'’) అరెస్టు చేశాయి. మహిళలను తాకడం, కావాలనే టచ్ చేయడం, విజల్స్ వేయడం వంటి పిచ్చి పనులు చేసిన వారందరినీ సీసీటీవీ పుటేజీ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. 'జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్ జరిగింది.
Also Read: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?
ఈ ఎగ్జిబిషన్ లో మొత్తం 37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష విధించాం. 33 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించాం. నిందితుల్లో 190 మందిని హెచ్చరించి వదిలేశాం. మరో 20 కేసులపై విచారణ జరుగుతోంది. మొత్తం 247 మంది ఆకతాయిల్లో 223 మంది మేజర్లుండగా 24 మంది మైనర్లున్నట్లు లిస్ట్ రిలీజ్ చేశారు.
Also Read: Eknath Shinde: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. ఏమన్నారంటే ?