Sexual harassment: సోషల్ మీడియాలో పరిచయం.. ఓయో రూమ్‌లో రాస లీలలు.. చివరికి బిగ్ ట్విస్ట్!

రాష్ట్రంలో లైగింక వేధింపుల కేసులు పెరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన షీ-టీమ్స్ దాదాపు 100 మందికిపైగా నిందితులను గుర్తించి జైలుపాలు చేశాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పరిచయాలు, ఓయో రూమ్ కేసులే అధికంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  

New Update
she teams

Telangana She Teams special focus on sexual harassment of women

Sexual harassment: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా లైంగిక వేధింపులు ఆగట్లేదు. 90శాతం మహిళలపైనే కామాంధులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. పసి పిల్లల నుంచి ముసలమ్మలదాకా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో డేటింగ్, లివింగ్ రిలేషన్ పేరిట దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా బయటపడిన కొన్ని ఘటనలపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టిపెట్టాయి. 100 మందికిపైగా నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకుని శిక్షలు విధిస్తున్నాయి. 

నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్..

ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచమైన మహిళతో అక్రమ సంబంధం కుదిరింది. దీంతో ఆమెను ఓయో రూమ్ కు తీసుకెళ్లి, నమ్మించి నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు తనకు కావాల్సినప్పుడు రావాలని బెదిరించాడు. మరింతమంది స్త్రీలను శృంగారంలో కోసం పపించాలని వేధించాడు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. షీ–టీమ్స్‌ బృందాలు అరెస్ట్ చేసినట్లు డీసీపీ డాక్టర్‌ ఎన్‌జేపీ లావణ్య తెలిపారు. నిదింతుడికి 3 రోజుల జైలు శిక్ష వేశారు. 

పోలీసులకే షాక్ ఇచ్చిన యువతి..

ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. అయితే ఇదంతా రహస్యంగా వీడియో తీసిన పక్క ఇంట్లో ఉండే యువకుడు.. ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తనతో పడుకోవాలంటూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో షీ–టీమ్స్‌ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 4 రోజుల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర ఉండే ఓ యువతి గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కానీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడడ్డాయి. పోలీసులనే టార్గెట్‌చేసిన యువతి వారి ఫోన్లు తీసుకుని అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు పంపించుకుంది. ఆ తర్వాత  పోలీసులనే బెదిరించగా ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

చెత్త బండి డ్రైవర్ పిచ్చి చూపులు..

హైదరాబాద్‌లో ఇది అత్యంత దారుణమైన కేసు. ఇంటి చెత్త సేకరించే ఆటో డ్రైవర్‌ ఓ మహిళను లైగికంగా వేధించాడు. అసభ్యంగా మాట్లాడటం, ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. డెకాయ్‌ ఆపరేషన్‌ చేసిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 4 రోజుల జైలు శిక్ష వేసింది. మరో కేసులో ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, మాదన్నపేట, ఛత్రినాకలో బాలికలను వేధిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోచోట పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కోరిక తీరగానే మొహం చాటేసిన యువకుడిపై షీ–టీమ్స్‌ పోక్సో కేసు నమోదు చేయించాయి. ఇదిలా ఉంటే.. బహిరంగ ప్రదేశాల్లో యువతులు, మహిళలను టార్చర్ చేస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.

 

తియ్యటి మాటలు నమ్మొద్దు..

ఈ సందర్భంగా ప్రజలు, మహిళలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. 'సోషల్ మీడియా పరిచయాలతో అప్రమత్తంగా ఉండండి. అపరిచితుల తియ్యటి మాటల్ని నమ్మకండి. మంచిగా మాట్లాడుతున్నారు కదా అని వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. ఎవరైనా సోషల్‌మీడియాలో వేధింపులకు గురిచేస్తే తక్షణమే పోలీసులను ఆశ్రయించండి. మీ గోప్యతకు భంగం వాటిల్లకుండా పరిష్కారం లభిస్తుంది' అని పోస్ట్ పెట్టారు. 

 sexual-harrasement | she-team-focus | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు