/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
Shamshabad Airport
Shamshabad Airport : ఈ మధ్య ఫేక్‌కాల్స్ మెయిల్స్ బెడద ఎక్కువైంది. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్‌కు కాల్స్ చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమైంది. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విమానశ్రయంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇక ఎయిర్ పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. బాంబు బెదిరింపు విషయంలో ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు దుండగులు మొయిల్స్ ద్వారా ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అసలు ఈ ఫేక్ కాల్స్ ఎవరూ చేస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వరుసగా ఇలాంటి కాల్స్ ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో జన సామర్థ్యం ఉండే ప్రదేశాల్లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫేక్‌కాల్స్, మెయిల్స్ విషయంలో అధికారులు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచిస్తున్నాయి.